Telangana Anganwadi Breakfast Scheme: అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. ఈ నెల 12 నుంచి ప్రారంభం
Telangana Anganwadi Breakfast Scheme: తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత మెరుగైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. ఈ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యే పిల్లలకు ప్రతిరోజూ ఉదయం ఉప్మా లేదా కిచిడీతో పాటు పాలు అందించనున్నారు. చిన్న వయస్సులోనే పిల్లలకు అవసరమైన పోషకాహారం...