ప్రజా దీవెన, హైదరాబాద్:
Telangana MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అ భ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం ఆదివారం ప్రకటించింది. దీం తో తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయ శాంతిలు ఖరారయ్యారు. ఇప్పటికే పార్టీ ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్ తమ పార్టీ తరపున ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవ కాశం ఇచ్చింది.
ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల విషయంలో తొలిత నుంచి రకరకాల ఊహాగానాలు వెలువడినప్పటికీ ఊహించని విధంగా తెరపైకి ప్రముఖ సినీ నటి విజయశాంతి పేరు వచ్చింది.