Telangana Tops Rabi Procurement: బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన, రబీ కొనుగోళ్లలో దేశంలోనే నంబర్-1గా ‘రేవంత్ స ర్కార్’ సరికొత్త రికార్డు సృష్టించింది.

- ఢిల్లీ దిగిరాకున్నా తెలంగాణ ‘రై తు’ గెలిచింది
- కేంద్రం నిర్లక్ష్యం చేసినా రేవంత్ స ర్కార్ సాహసం చేసింది
- కేంద్రం కొనుగోలు లక్ష్యాన్ని తగ్గిం చి రైతుకు అన్యాయం చేసింది
- జాతీయ కొనుగోళ్లలో 61శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచిoది
- మీడియా సమావేశంలో పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి
ప్రజాదీవెన, హైదరాబాద్: రాజకీయాలు కాకరేపవచ్చు.. సవాళ్లు ఎదురుకావచ్చు.. కానీ, మట్టి నమ్ముకున్న రైతు ముఖంలో నవ్వు చూడటమే పరమావధిగా భావిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిరూ పించిందని రాష్ట్ర పౌర సరఫరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను కుదించినా, పక్క రాష్ట్రాలు చేతులెత్తేసి నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగిందన్నారు. ఫలితంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించి నంబర్-1 స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు వాకిటి శ్రీహ రి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ రఘువీర్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పౌరసరఫరాల శాఖ విజయగా థను గర్వంగా ప్రకటించారు.
తెలంగాణలో రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల (Metric Tons) అపార దిగుబడి వ స్తుందని అంచనా వేసి, కొనుగోలు లక్ష్యాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను పదేపదే కేంద్ర ఆహారశాఖకు, ఎఫ్‌సీఐ (FCI) కి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రబీ ఉత్పత్తి 28 శాతం పెరిగితే.. కేంద్రం మాత్రం కొనుగోలు లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుండి ఏకంగా 52 లక్షల టన్నులకు తగ్గించి రైతులకు అన్యాయం చేసింద ని, కానీ, కేంద్రం నిర్లక్ష్యానికి మా రైతులు బలికాకూడదని సీఎం రేవం త్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.

అంకెల్లో తెలంగాణ ‘ధాన్యం’ విప్లవం
కేంద్ర ప్రభుత్వం పెట్టిన లక్ష్యం 52 లక్షల మెట్రిక్ టన్నులు కాగా రా ష్ట్రం సేకరించిన ధాన్యం 75 లక్షల మెట్రిక్ టన్నులని, లక్ష్యానికి మించి చరిత్ర సృష్టిస్తూ రైతుల అకౌంట్ల లో కి రూ.17,917 కోట్లమేర నేరుగా కనీస మద్దతు ధర అందిందని చె ప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతు న్న మొత్తం రబీ ధాన్యం కొనుగోళ్ల లో సింహభాగం ఒక్క తెలంగాణదే కావడం విశేషం. జాతీయ స్థాయి లో జరుగుతున్న కొనుగోళ్లలో 61 శాతం వాటాతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 25.03 లక్షల టన్నులు సేకరిస్తే, తెలంగాణ అంతకంటే మూడు రెట్లు అధికంగా 75 లక్షల టన్నులు సేకరించి దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు
ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 202 5-26 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని, ఇది స్వరాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నే అత్యున్నత రికార్డు అని, మొ త్తం 295 లక్షల మెట్రిక్ టన్నుల ఉ త్పత్తిలో సగానికి సగం కొనుగోలు చేసి 25.20 లక్షల రైతు లావాదేవీ ల ద్వారా వారి ఖాతాల్లోకి రూ.3 5,077 కోట్ల మద్దతు ధరను జమ చేసిందని గుర్తు చేశారు.
రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది పడకూడదని రేవంత్ సర్కార్ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసిందని, దేశంలో వైశాల్యపరంగా పెద్దదైన ఉత్తరప్ర దేశ్‌లో కేవలం 4,850 కొనుగోలు కేంద్రాలు ఉంటే తెలంగాణలో రబీలో 8,575 కేంద్రాలు (యూపీ కంటే 1.7 రెట్లు ఎక్కువ) ఏర్పాటు చేశారని వెల్లడించారు. గత రెండే ళ్లలోనే 3,000కు పైగా కొత్త కొను గోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. గన్నీ సంచుల కొరత లేకుండా 20.86 కోట్ల సంచులను సిద్ధం చేయగా, ఇంకా 2. 11 కోట్ల సంచులు నిల్వ ఉన్నా యన్నారు.
అకాల వర్షాలు రైతన్న గుండెల్లో అలజడి రేపిన వేళ ప్రభుత్వం అండ గా నిలిచిందని, వర్షానికి తడిసిన 12,557 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని ప్రత్యేక చర్యల ద్వారా బా యి ల్డ్ రైస్ మిల్లులకు తరలించామని , కేవలం 12 గంటల వ్యవధిలోనే రైతులకు మద్దతు ధర చెల్లించి నష్ట పోకుండా కాపాడారని వివరించారు. మరోవైపు ఈ కొనుగోళ్లలో ఐకేపీ, పీఏసిస్ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కీల క పాత్ర పోషించాయని, వారికి ప్రభుత్వం తరఫున ఏకంగా రూ.47 0.40 కోట్ల కమిషన్ అందించి మహిళా సాధికారతకు అద్దం పట్టిం దని చెప్పారు.
రాజకీయ యాత్రలు మానుకోండి..
“ధాన్యం కొనుగోళ్లు ఇంత అద్భు తంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గు రి చేయాలని చూస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో డ్రామాలు ఆడే బీ జేపీ నేతలకు చేతనైతే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రై తులకు న్యాయం జరిగేలా చూడా లని హితవు పలికారు. రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజనూ కొ నేవరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని, రైతాంగానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Tops Rabi Procurement



