Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TG DSC 2024: సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం

ప్రజా దీవెన మునుగోడు అక్టోబర్ 11

 

TG DSC 2024: డీఎస్సీ 2024 పరీక్ష రాసిన 60 రోజుల్లోనే ఫలితాలు రావడంతో పాటు నియామక పత్రాలు (Appointment documents) కూడా అందించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిపాలనకు రుణపడి ఉంటామని నాంపల్లి మండలం (Nampally Mandal) తిరుమలగిరి (Tirumalagiri) గ్రామానికి చెందిన తిరుమణి శ్రీనివాస్ (Thirumani Srinivas) అన్నారు. బుధవారం రోజున హైదరాబాదులో హిందీ (Hindi) ఉపాధ్యాయునిగా నియామక పత్రం అందుకున్నారు. ఆయన ప్రజా దీవెనతో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం పోటీపడే విద్యార్థులు యువకులు ప్రణాళికాబద్ధంగా సమయపాలన పాటించి శ్రమించాలని అన్నారు.

 

గ్రంథాలయాల (Libraries) ద్వారా పుస్తక పఠనం చేస్తే ఉద్యోగం పొందడం ఖాయమన్నారు. “నేను నాంపల్లిలోని లైబ్రరీ సహాయంతో ఒక సంవత్సరం పాటు నిర్విరామంగా చదువుతూ కృషి చేయడం వల్ల ఉద్యోగం సాధించాన”ని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులు మండల కేంద్రంలోని గ్రంథాలయం సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. యువకులు మద్యం, ఇతర వ్యసనాలకు బారిన పడకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు ప్రకటిస్తున్నారని సమయాన్ని విభజించుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పారు.

 

తనకు కేటాయించిన ఉద్యోగం (Job)తో తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేలా తనవంతుగా సూచనలు సలహాలు ఇస్తానని అన్నారు. అనంతరం నాంపల్లి మండలం శాలివాహన సంఘం మండల నాయకులు తిరుమణి శేఖర్ కామిశెట్టి పాండు కామిశెట్టి నాగరాజు శ్రీకాంత్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.