
TGPSC Deputy EO Recruitment: తెలంగాణలో ప్రభు త్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీ పీఎస్సీ (TGPSC) కీలక ప్రకటన చేసింది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీ సర్ (డిప్యూటీ ఈవో), గ్రేడ్ 1 హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో విద్యాశాఖలో ఉ న్నత స్థాయి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మల్టీ జోన్ 1 పరిధిలో 10 పోస్టులు ఉండగా, మల్టీ జోన్ 2 పరిధిలో 14 పోస్టులు ఉన్నాయి. జి ల్లా ల వారీగా, రిజర్వేషన్ (Reservations)ల వారీగా ఖాళీ ల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్ల డించింది.అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు లు స్వీకరించనున్నారు. జూన్ 12 నుంచి దరఖాస్తుల ప్రక్రి య ప్రారంభమవుతుండగా, జూలై 19 సాయంత్రం 5 గంట ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చివరి రోజుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ముందుగానే దరఖాస్తులు (Applications)పూర్తి చేసుకో వాలని అధికారులు సూచిస్తున్నారు.

నియామక పరీక్షను మొత్తం 450 మార్కులకు నిర్వహించ నున్నారు. పోస్టుల స్వభావానికి అనుగుణంగా అభ్యర్థుల విద్యా, పరిపాలనా సామర్థ్యాలను అంచనా వేసే విధంగా పరీక్ష ఉండనుంది. పరీక్షా విధానం, సిలబస్, అర్హతలు, వ యోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన పూ ర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచా రు. టీజీపీఎస్సీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ల (హాల్విlడుదల, ఇతర ముఖ్యమైన సమాచారం అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించనున్నారు.
Also Read:Former Maoist Leader Devji Secures Rank 349 in LAWCET: లాసెట్‌లో దేవ్‌జీ సత్తా.. 349వ ర్యాంకు
ఇటీవల తెలంగాణలో పలు శాఖల్లో ఉద్యోగ నియామక ప్రక్రి యలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠ శా లల్లో పరిపాలనా బాధ్యతలు నిర్వహించాలనే లక్ష్యంతో ఉ న్న ఉపాధ్యాయులకు, అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మం చి అవకాశం అని విద్యా వర్గాలు అభిప్రాయపడుతు న్నా యి.అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నో టిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి అర్హతలు, అవసరమైన ధ్రు వపత్రాలు, పరీక్షా విధానం వంటి అంశాలను స్పష్టంగా తెలు సుకోవాలని అధికారులు సూచించారు.




