— హైదరాబాద్ జలవిహార్ రజతోత్సవ సభకు తరలిరావాలి
— టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభకు జర్నలిస్టు సమాజం స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజె నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ కోరారు. టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈనెల 31వ తేదీన 25 సంవత్సరాల సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లా నుంచి జర్నలిస్టు సోదరులు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు.
సోమవారం నల్లగొండలో టీజేఎఫ్ రజతోత్సవాల సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2001 మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా టీజెఎఫ్ విర్భవించిందన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి రాష్ట్ర సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. టీజెఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని జలవిహార్ లో ‘జర్నలిస్టుల జాతర’ను నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు హాజరవుతారన్నారు.
హైదరాబాదులోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ జాతరకు జిల్లా లోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టు సోదరులు కావాలని అన్నారు. టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ అధ్యక్షతన రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషరాజుపల్లి వీరస్వామి, యూనియన్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి సల్వాది జానయ్య, నాయకులు కంది వేణు, శ్రీనివాస్, దండంపల్లి రవికుమార్, ఉబ్బని సైదులు, ఓడపల్లి మధు, ముచ్చర్ల శ్రీనివాస్, పెద్దగోని మధు, మహేశ్వరపు రాంప్రసాద్, రెమిడాల మధు, పాలకూరి శేఖర్, జాజాల కృష్ణ, భాస్కర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.