TTD Permission : ప్రజా దీవెన, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులేఖలకు గతంలో నిరాకరించిన అనుమతిని తాజాగా ఏపీలోని కూటమి ప్రభు త్వం పునరుద్ధరించింది. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణా సిఫా ర్సు లేఖలకు శ్రీవారి దర్శనం లో ప్రత్యేక అవకాశం కల్పిస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో తెలంగాణా ప్రజా ప్రతినిధులను పట్టించు కో కుండా అప్పటి టీటీడీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల విన్నపాలను ఆలకించిన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ బీ అర్ నాయుడు ప్రత్యేక చొరవ చూ పడంతో తెలంగాణ ప్రజాప్రతినిధు లు లేఖలు స్వీకరించే విధానం ఇక పై కొనసాగనుంది. అయితే సోమ, మంగళవారాల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించేందుకు నిర్ణ యించగా బుధ,గురువారాల్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటా యించాలని నిర్ణయం తీసు కున్నా రు.
కాగా ఈ ప్రత్యేక దర్శనం అమ లు విధానంలో ప్రజాప్రతినిధి ఒక రికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే అం దులో 6 గురుకి మించకుండా దర్శ నం కేటాయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సందర్భంలో ఏపీ ప్రజా ప్రతినిధు లకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. సోమవారం రోజు కు ప్రత్యామ్నయంగా శనివారం, ఆదివారం దర్శనం కొరకు లేఖలు స్వీకరించనుంది. ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అనుమతి విష యంలో సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణ యం తీసుకుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి స హకరించాలని భక్తులను టిటిడి పాలక మండలి విజ్ఞప్తి చేస్తుంది.