Ursu Paper: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ (Nalgonda) పట్టణంలోని క్లాక్‌టవర్ సమీపంలోని హజరత్ సయ్యద్ లతీఫ్ షా ఉల్లా ఖాద్రి (Hazrat Syed Latif Shah Ullah Qadri) ఉర్సు ఉత్సవాల (Ursu celebrations)కు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉర్సు ఉత్సవాలకు సంబంధించి ఆదివారం ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 17 నుంచి జరిగే ఉర్సు ఉత్సవాలలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లోటుబాట్లు లేకుండా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని దర్గా కమిటీని కోరారు. ఉర్సు ఉత్సవాలకు అన్ని రకాల సదుపాయాలు మున్సి పాలిటీ కల్పిస్తుందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నవీన్ గౌడ్, ఇబ్రహీం, సయ్యద్ సమద్, ఉర్సు కమిటీ సభ్యులు ఇంతియాజ్ హుస్సేన్ చాన్ భాయ్,జియా, సయ్యద్ ఇర్ఫాన్, ఇనందర్ ముతవల్లీలు.. సయ్యద్ సమీవుల్లా ఖాద్రి, సయ్యద్ గౌస్ ఉల్లాఖాద్రి, సల్మాన్ ఖాద్రి, సయ్యద్ ఉబేద్ ఖాద్రి, తబరేజ్ ఖాద్రి తదితరులు దర్గా కమిటీ (Dargah Committee) నిర్వాహకులు పాల్గొన్నారు.