డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా కొట్టిన కారు
ప్రజా దీవెన/హైదారాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు చెట్లను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు.