ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులభతరం కాదు.కానీ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ పట్టుదలతో చదివితే సాధ్యం కానిదంటూ ఉండదని నిరూపిం చాడు శాలిగౌరారం మండలం బాలిశెట్టిగూడెం గ్రామానికి చెందిన తాటిపాముల అశ్విని కుమార్ బుధవారం రాత్రి టీజీపీఎస్సీ (𝗧𝗚𝗣𝗦𝗖) విడుదల చేసిన ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల అధ్యాపకుల ఫలితాల్లో మల్టీ జోన్-2 కింద బాటనీ లెక్చరర్ గా ఎంపికయ్యాడు.
గత రెండు డీఎస్సీలో కొద్ది మార్కులతో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కలేదు.ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూ మరోవైపు ప్రణాళిక బద్ధంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించుకోలేదు.ప్రభుత్వ ఉద్యోగాలు రావడం గగనమని,నిరాశతో నిట్టూర్పుతున్న గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.ఈ సందర్బంగా అశ్విని కుమార్ ను పలువురు అభినందించారు.
T𝗚𝗣𝗦𝗖