10th Exams: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధు లకు పబ్లిక్ పరీక్షలు సమీపిస్తు న్నాయి. వీటికి ముందు నిర్వహిం చే ప్రీ ఫైనల్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి 6 నుంచి ప్రారంభం అవుతాయి. ఇవి ముగి సిన తర్వాత ఏపీలో మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో షెడ్యూ ళ్లు వచ్చేశాయి.
ఏపీ టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల పూ ర్తి టైం టేబుల్:
– ఫిబ్రవరి 10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1(కాంపోజిట్ కోర్సు) పరీక్షలు
– ఫిబ్రవరి 11వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
– ఫిబ్రవరి 12న ఇంగ్లిషు పరీక్ష
– ఫిబ్రవరి 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్ష
– ఫిబ్రవరి 15న గణితం పరీక్ష
– ఫిబ్రవరి 17న భౌతిక శాస్త్రం పరీక్ష
– ఫిబ్రవరి 18న జీవ శాస్త్రం పరీక్ష
– ఫిబ్రవరి 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష
– ఫిబ్రవరి 20న సోషల్ స్టడీస్ పరీక్ష
తెలంగాణ పదో తరగతి ప్రీ-ఫై నల్ ఎగ్జామ్ షెడ్యూల్:
– మార్చి 6వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్
– మార్చి 7వ తేదీన సెకండ్ లాంగ్వేజ్
– మార్చి 10వ తేదీన ఆంగ్లము
– మార్చి 11వ తేదీన గణితం
– మార్చి 12వ తేదీన భౌతిక శాస్త్రం
– మార్చి 13వ తేదీన జీవ శాస్త్రం
– మార్చి 15వ తేదీన సోషల్ స్టడీస్