Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

patriotism: 200 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ.

*ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి.
*దేశభక్తి పెంపొందేలా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయ సామినేని. ప్రమీల.

patriotism: ప్రజా దీవెన, కోదాడ: ప్రజలందరిలో దేశభక్తి (patriotism)పెంపొందేలా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని. ప్రమీల అన్నారు.కోదాడ పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణకు (Inauguration of the National Flag) సిద్ధమైన సందర్భంగా పట్టణంలో ముందస్తుగా నిర్వహించిన భారీ ర్యాలీని బాయ్స్ హై స్కూల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 

ఐ వి ఓ సభ్యులు, పాఠశాల, కళాశాల ప్రజా ప్రతినిధులతో కలిసి 200 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రధాన రహదారిపై బస్టాండ్ నుండి ఖమ్మం క్రాస్ రోడ్, రాజీవ్ చౌరస్తా, వాయల సింగారం రోడ్డు (Khammam Cross Road, Rajeev Chowrastha, Wayala Singaram Road)వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహనీయుల కృషి త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని మహనీయుల ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జిని. రవీందర్ రావు,రాష్ట్ర కోఆర్డినేటర్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు గుండా. మధుసూదన్ రావు, ప్యాట్రన్ గుండాపూనేని.నాగేశ్వరరావు, జగని.ప్రసాద్, సూర్యపేట జిల్లా కోఆర్డినేటర్ గోవింద. నవీన్, పిఆర్వో షేకు.రమేష్, కత్తి భగత్, శారద, సత్యమూర్తి, అరుణ్, పైడిమర్రి. వెంకటనారాయణ, మునీర్ తదితరులు పాల్గొన్నారు…….