Nominations: తిరస్కరణకు 267 నామినేషన్లు
లోక్ సభ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రి య ముగిసి శనివారం నుంచి నామి నేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ప్రారంభమైంది.
మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణ
17 స్థానాలకు దాఖలైన 893 నామినేషన్ లలో 267 తిరస్కరణ
ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)నామినేషన్ దాఖలు ప్రక్రి య ముగిసి శనివారం నుంచి నామి నేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ ఆశలు నామినేషన్ పరిశీలన రోజునే ఆవిరి కావడo గమనార్హం.
వరంగల్ ఎంపీ సీటుకు దాఖలు చేసిన నామినేషన్ (Nomination)పత్రాల్లో ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో తిరస్క రించారు. ఇటీవలే బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరినంత వేగంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన విషయం విదితమే. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయా లని భావించినా నామినేషన్ తిరస్కరణతో ఉసూరుమన్నారు.
ఇక సీనియర్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannath)నాగర్ కర్నూలు స్థానానికి బీఎస్పీఅభ్యర్థిగా వేసిన నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. బీ ఫామ్ జత చేయకపో వడంతో నామినేషన్ ను తిరస్కరణ కు గురైంది. ఈ క్రమంలోనే తెలంగా ణలో మొత్తంగా 17 సీట్లకు 893 మంది నామినేషన్లు దాఖలు కాగా అందులో 267 మంది నామినేష న్లను అధికారులు తిరస్కరించారు. కాగా నేటి నుంచి నామినేషన్ల ఉప సంహరణ కార్యక్రమం కొనసాగు తోంది.
267 Nominations rejection in elections