–ఏకలవ్యుడి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి
–స్థానిక సంస్థల్లో ఎరుకల సామా జికవర్గం వారికి అన్ని పార్టీలు అవ కాశమివ్వాలి
–తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
BRS MLC Kalvakuntla kavita : ప్రజా దీవెన, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 500 కోట్లతో ఎ రుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయా లని తెలంగాణ జాగృతి అధ్యక్షు రాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి చెందిన వారికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించి వారిని గెలి పించుకోవాలని సూచించారు.
ఏకలవ్యుడి జయంతి సందర్భంగా ఆదివారం ట్యాంక్ బండ్ పై ఉన్న కొమురం భీమ్ విగ్రహం వద్ద ఏకల వ్యుడి చిత్రపటానికి ఎమ్మెల్సీ కవి త నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ కేసీఆర్ మొదలుపెట్టిన ఏకల వ్యుడి భవన నిర్మాణాన్ని పూర్తి చే యని దారుణ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎరు కల సామాజిక వర్గం అభివృద్ధి కో సం ఎరుకల సాధికారత పథకాన్ని కేసీ ఆర్ ప్రవేశపెట్టారని, ఆ పథకా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొ క్కిందని మండిపడ్డారు. పలు సంద ర్భాల్లో తాను శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తానని, అయి నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టి నట్లు కూడా లేకపోవడం దారుణ మన్నారు.
50 వేల ఎరుకల కుటుంబాలకు రూ 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ పథ కాన్ని మరింత మెరుగుపరిచి ప్రభు త్వం యధాతధంగా అమలు చే యాలని డిమాండ్ చేశారు. ఎరు కల సామాజిక వర్గ రాజకీయ అభి వృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరు కల సామాజిక వర్గానికి అన్ని పార్టీ లు సముచిత అవకాశాలు కల్పిం చాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారా యణకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తే అప్పటి గవర్నర్ అడ్డుకున్నా రని అన్నారు.
ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలపై ఎంతలా అణిచివేత ఉందో చెప్పడానికి ఏకలవ్యుడి జీవి తమే ఒక ఉదాహరణ అన్నారు. చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఆయన సమాజానికి మంచి మార్గం చూపిం చే ప్రయత్నం చేసి ఆరాధ్య దైవమ య్యారని కొనియాడారు. బహుజన లకు రాజకీయ, విద్య, ఉపాధి రం గాల్లో సమాన అవకాశాలు దక్కా లన్న ఉద్యమంలో తాను పాల్పం చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏకల వ్యుడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఏ ర్పాటు చేయించుకునే ప్రయత్నం చేద్దామని స్పష్టం చేశారు.
అదేవిధంగా జియాగూడ సబ్జీమం డిలోని గోల్కొండ శ్రీ జగదాంబకి ఎల్లమ్మ ఆలయ 51వ వార్షికోత్స వం, బోనాల పండగ ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త పాల్గొన్నారు. ఈ సందర్భంగా అ మ్మవారి ఆలయంలో గంగపుత్ర సం ఘం నాయకులు, కార్యకర్తలతో కలి సి ఎమ్మెల్సీ కవిత పూజలు నిర్వ హించారు.ఈ కార్యక్రమంలో తెలం గాణ జాగృ తి నాయకులు రూప్ సింగ్, తెలం గాణ ఆదివాసీ ఎరుక ల సంఘం అ ధ్యక్షుడు లోకిని రా జు, ప్రధాన కార్యదర్శి కుతాడి రవి కుమార్, కోనేటి నరసింహ తదిత రులు పాల్గొన్నారు.