రాజపేటలో దారుణం రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
ప్రజా దీవెన /యాదాద్రి భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన బాలుడు చనిపోయిన ఘటన శుక్రవారం రాజపేట గ్రామంలో చోటుచేసుకుంది. రాజపేట గ్రామానికి చెందిన బిర్రు శ్యామ్ రెండో కుమారుడు బిర్రు ధనుష్, (7) తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా బాలుడు మార్గమధ్యంలోనే చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు డాక్టర్ తెలిపారు. సంఘటన స్థలానికి రాజపేట ఎస్సై సుధాకర్ రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..