కుక్క దాడిలో చిన్నారి మృతి
— జగిత్యాల జిల్లాలో విషాదం
ప్రజా దీవెన/జగిత్యాల: బజారు కుక్క దాడిలో చిన్నారి కన్నుమూసిన సంఘటన జగిత్యాల జిల్లా లోని గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో 15 రోజుల క్రితం ఇంటి వద్ద అడుకుంటుండగా సాహిత్య అనే చిన్నారిపై బజారు కుక్క దాడి చెసింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ అస్వస్థతకు గురైన చిన్నారి సాహిత్య తుది శ్వాస విడిచిoది. చిన్నారి తండ్రి పొట్టకూటి కోసం గల్ఫ్ దేశంలో ఉoటుండగా ఆయన వచ్చిన తర్వాతే చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియ జేశారు. అయితే అదే గ్రామంలో సుమారు 15 మందిని కుక్క గాయపరిచినట్లు గ్రామస్థులు చెబుతుండగా మొత్తానికి చిన్నారి మృతితో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.