తప్పిన ఘోర ప్రమాదం
— బస్సు ప్రయాణికులంతా క్షేమం
ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో హనుమాన్ పేట ఫ్లైఓవర్ సమీపంలో ఘోర ప్రమాదం కనుచూపు మేర లో తప్పింది. తెల్లవారుజామున ఓ ప్రయివేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుండి నెల్లూరుకు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు వెనుక టైర్ పెద్ద సబ్దం చెస్తూ పేలడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ లోప్రమాదం సమయంలో 26మంది ప్రయాణికులు ఉన్నారు. స్వయంగా ప్రయాణికుల అప్రమత్తoగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైoది. మిర్యాలగూడ పోలిసులు కేసు నమోదు చేసుకుని పరిస్థితిని సమీక్షించారు.