Rajesh Press Club : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజ కీయం,సమస్యలపై మేధో అక్షర మధనం చేస్తూ ప్రభుత్వాలకు, ప్రజ లకు మధ్య వారధిగా విధులు నిర్వ హిస్తున్న జర్నలిస్ట్ లకు మానసిక ప్ర శాంతత,ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పోందేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు రానే వచ్చా యి. బుధవారం ఉదయం నుంచే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎంతో కోలాహాలంగా జరిగింది. హైదరాబా ద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్ష పదవికి సీని యర్ జర్నలిస్ట్ రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ యన ఈసారి ఉపాధ్యక్ష పదవికి పో టీ చేస్తున్నారు. క్లబ్ సభ్యులకు సేవ లందించడంతో పాటు క్లబ్ అభివృ ద్ధిలో ఎ.రాజేష్ తన వంతు కృషి చే శారు. రాజేష్ కు మద్దతుగా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు నా మినేషన్ లో పాల్గొన్నారు. ఈ కా ర్యక్రమంలో తెలంగాణ యూనియ న్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షు లు కె.విరహత్ అలి, ఆర్. రవికాం త్ రెడ్డి , డి. విజయకుమార్ రెడ్డి, వి.రమేష్, వైట్ల.రమేష్, శిగా శం కర్ , హరిప్రసాద్, సి.వనజ, అబ్దు ల్ ,ఈ.జనార్థన్ రెడ్డి, ఎ. శ్రీకాం త్ ,ఎ.పద్మావతి, ఎం. రమాదేవి, చి న్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ నాయకులు బా లకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.