Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A robust voter list should be prepared: పటిష్ట ఓటరు జాబితా రూపొందించాలి

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పటిష్ట ఓటరు జాబితా రూపొందించాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ప్రజా దీవెన/నల్లగొండ: ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో బాగంగా నందికొండలో ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలను నల్లగొండ  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ( Nalgonda District Collector R.V. Karnan) పరిశీలించారు.ఆదివారం  నాగార్జునసాగర్ నియోజకవర్గం నందికొండ పట్టణం హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గల 97, 98,99, 100, 101 పోలింగ్ స్టేషన్లనకు సంబందించి ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం  పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓటర్ నమోదు కార్యక్రమం ద్వారా పటిష్ట ఓటర్ జాబితా రూపొందించాలని అన్నారు. ఓటర్ నమోదు,ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులకు ఎన్ని దరఖాస్తులు వచాయని అడిగి  తెలుసుకొని  రిజిస్టర్ లను పరిశీలించారు.

డబుల్ ఓటర్లను ఎట్టి పరిస్థితిలోనూ ఓటర్ జాబితాలో లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా చనిపోయిన ఓటర్లకు సంబంధించిన వివరాలు (Details of dead voters)  మరణం పత్రము లేదా కుటుంబ సభ్యుల చేత నిర్ణీత ఫారంలో వివరాలు సేకరించి తొలగించాలన్నారు.

1 అక్టోబర్ 2023 నాటికి18 సం.లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా ( That everyone who is eligible has the right to vote) బి.ఎల్. ఓ  లుకృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, తహశిల్దార్ సరోజ పావనిలు పాల్గొన్నారు.

*అర్హులైన చెంచులకు ఇండ్ల స్థలాలు..* అర్హులైన చెంచులకు   ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ(Distribution of house plots to deserving Chenchis) చేయనున్నట్లు  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.ఆదివారం  తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధిలోని చెంచు వాని తండాలో జిల్లా కలెక్టర్  పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలో నివసించే  చెంచులకు  అర్హులైన 36 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ కి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు(  Rails for waste lands) రాని వారు అర్హులైన వారు ఉంటే రీ వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇండ్ల పట్టాలు పొందే వారితో పాటు తండావాసులు గృహాలు నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలు(  Three lakh rupees under Griha Lakshmi Scheme) అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,జిల్లా  గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, తహాశిల్దార్ యాదగిరి, ఎం.పి.డి.ఓ తదితరులు పాల్గొన్నారు.