అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలి.
Abdul Kalam’s birth anniversary: ప్రజా దీవెన, కోదాడ:భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు (Paidimarri Satthibabu) లు అన్నారు. మంగళవారం అబ్దుల్ కలాం జయంతి (Abdul Kalam’s birth anniversary) సందర్భంగా పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహోన్నతమైన (sublime) వ్యక్తి కలాం అని నేటి యువత వారు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు, ఇమ్రాన్ ఖాన్, సుందర్ బాబు, అబ్బు బకర్, నాగరాజు, చిమ శ్రీను, సిద్ధల రాంబాబు, సంపత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.