Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Academy Chairman K Srinivas Reddy : సామాజిక మాధ్యమాల పట్ల అప్ర మత్తత అవసరం

–త్వరలో హైదరాబాదులో జాతీ య సదస్సు
–అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ
–తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి

Academy Chairman K Srinivas Reddy : ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: సమా జంలో మీడియా భవిష్యత్ కు ప్ర శ్నార్థకంగా మారిన సామాజిక మాధ్యమాలు, ఆర్టి ఫిషియల్ ఇం టిలిజెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండా లని, దీనిపై త్వరలో హైదరాబాదు లో జాతీయస్థాయి వర్క్ షాప్ ను నిర్వహిస్తామని తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అధ్యక్షత న జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజే యూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశాని కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయ న మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇం టిలిజెన్సీ మూలంగా భవిష్యత్తులో మీడియా రంగంలో మ్యాన్ పవర్ లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కల్పితాలతో ఏఐ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్ర మాదం పొంచి ఉందని, దీనిపై జర్న లిస్టులు, ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అన్నారు. సోషల్ మీడియా విప్లవం భావ ప్రకటన స్వేచ్ఛకు మంచి వేదిక అయినప్పటికీ దానిని అడ్డుపెట్టుకొని కొన్ని శక్తులు అలజ డి సృష్టించడం సహించరానిది అ న్నారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించిందే కానీ ఇతరుల స్వేచ్ఛను హరించే హక్కు ఇవ్వలే దన్నారు. గత ప్రభుత్వం రూపొం దించిన అక్రిడిటేషన్ జీవో అప్రజా స్వామికంగా ఉందని కొందరు న్యా యస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ జీవను రద్దు చేస్తూ గదా అక్టోబర్ మాసంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో కొత్త మార్గదర్శకాలు రూపొందించేందు కు కమిటీ వేశామని , అంతేకాకుం డా ఆ కమిటీ నివేదికను ప్రభుత్వా నికి సమర్పించిందన్నారు.

త్వరలో దీనికి సంబంధించిన జీవో విడుదల కాను ఉందని ఆయన స్ప ష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న తప్పు డు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఈ విషయమై ఎవరు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి జర్నలి స్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూ రు అవుతాయని ఆయన తెలిపా రు. అక్రిడిటేషన్ కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చె ప్పారు.

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం…ఉద్యమాలతోనే జ ర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఐజేయు స్టీరింగ్ కమి టీ మెంబర్ దేవులపల్లి అమర్ అ న్నారు. ప్రభుత్వాలు ఏవైనా జర్న లిస్టుల పక్షపాతిగా, జర్నలిస్టుల సం క్షేమం కోసం గత 65 ఏళ్లుగా పోరాడుతున్న చరిత్ర తమ సంఘా నికే ఉందని అన్నారు. సంఘ నా యకులకు ప్రభుత్వ పదవులు వ చ్చినంత మాత్రాన, సంఘ ప్రయో జనాల కోసం కాదని ఆ పదవుల బాధ్యతలు వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

టీయూడబ్ల్యూజే ఐజేయు ఎవ రికీ అనుకూలం కాదు.. టీయూ డబ్ల్యూజే (ఐజేయూ) ఏ ప్రభుత్వా నికి, ఏ పార్టీకి అనుకూలం కాదని, జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్య మని రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అ లీ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్ర ధాన సమస్యలైన ఇండ్లు ఇళ్ల స్థలా లు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కా ర్డులు, ఉచిత విద్య తదితర సమ స్యలపై ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తున్నట్లు తెలిపారు. తమ సంఘం వినతి మేరకు రాష్ట్ర వ్యా ప్తంగా మెడికవర్ ఆసుపత్రుల్లో ఉం డే ఆర్థోపెడిక్, గుండె, కిడ్నీ సంబం ధిత వ్యాధులకు హెల్త్ కార్డులపై చి కిత్స చేసేందుకు ఆసుపత్రి యాజ మాన్యం నిర్ణయించడం అభినంద నీయమని అన్నారు. గత కార్యవర్గ సమావేశం అనంతరం చేపట్టిన కా ర్యకలాపాలపై రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కే రామనారాయణ నివేదిక స మర్పించారు.

ఈ సమావేశంలో ఐజేయూ కార్య దర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కా ర్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కా ర్యదర్శి కే రాములు, ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్, గాడి పల్లి మధు గౌడ్, పైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శులు గుండ్రాతి మ ధుగౌడ్, వరకాల యాదగిరి, కే శ్రీ కాంత్ రెడ్డి, కోశాధికారి మోతే వెం కటరెడ్డి తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ స మావేశాన్ని విజయవంతంగా నిర్వ హించిన నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ను రాష్ట్ర కార్యవర్గం అభినందిం చింది.

తీర్మానాలు
–జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రులందరికీ యు ద్ధ ప్రాతిపదికన వినతి పత్రాలు అం దించాలని సమావేశం తీర్మానించిం ది.

–సంఘ సంస్థాగత కార్యకలాపాల ను మరింత పటిష్టం చేయడానికి రాష్ట్ర బాధ్యులను జిల్లా ఇన్చార్జి లుగా నియమించాలని కార్యవర్గం నిర్ణయించింది.

— టీయూడబ్ల్యూజే (ఐజేయు)కు అనుబంధంగా ఉన్న ప్రెస్ క్లబ్ ల కార్యకలాపాలను పరిశీలించేం దు కుగాను ఆరుగురు సీనియర్లతో క మిటీ ఏర్పాటు చేయాలని కార్య వర్గం నిర్ణయించింది.

–ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌక ర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కో రుతూ తీర్మానం చేసింది.