sheep scam: విచారణ మరింత వేగవంతం
తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తును ఏసీబీ అధికారులు మరింత వేగ వంతం చేశారు. నిందితులను ఏసీ బీ కస్టడీ లోకి తీసుకుని విచారించేం దుకు రంగం సిద్ధం చేశారు.
గొర్రెల పథకం అవినీతి, అక్రమా లపై ఏసీబీ అధికారుల దూకుడు
నిందితుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తును ఏసీబీ అధికారులు మరింత వేగ వంతం చేశారు. నిందితులను ఏసీ బీ కస్టడీ లోకి తీసుకుని విచారించేం దుకు రంగం సిద్ధం చేశారు. సోమ వారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచం దర్ నాయక్, తల సాని ఓఎస్డీ కళ్యాణ్‌లను కస్టడీకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లను మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు రామ్ చందర్ నాయక్, కళ్యాణ్‌లను కస్ట డీ కి తీసుకొని విచారణ చేయను న్నారు.
గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరి గినట్లు ఏసీబీ గుర్తించింది.ఎసిబి దీ నికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీల క విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహి నూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ACB officials investigation on sheep scam