ఏసీబీ చేతికి చిక్కిన అవినీతి చేప
ACBpolice: ప్రజా దీవెన తాండూర్: లంచం, లంచం, లంచం ఎ క్కడ విన్నా ఇదే రీ సౌండ్ తెలంగాణ వ్యాప్త నలుదిక్కులా పిక్కటి ల్లుతోంది. ఇటీవల అవినీతి ఆనవాళ్ళు, అవినీతి నిరోధక శాఖ దా డులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు వికారాబాద్ జిల్లా దారుర్ ఎస్సై వే ణుగోపాల్ గౌడ్ పట్టుబడ్డ ఘటన మంగళవారం జరిగింది.
గతంలో తాండూర్ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహించిన వేణుగో పాల్ గౌడ్ దారుర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ కేసు నుండి తప్పించేందుకు 70 వేల రూపాయలు డిమాండ్ చేయ గా అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన ఎస్సై వేణుగోపాల్ గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.