Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ACBraides: ఎసిబి వలలో మరో అవినీతి అనకొండ

ఎసిబి వలలో మరో అవినీతి అనకొండ

ACBraides:  ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారులు వేసిన వలలో మరో అవినీతి అనకొoడ చిక్కిం ది.లంచం తీసుకుంటూ జిహె చ్‌ఎంసి డిప్యూటీ ఈఈ సోమ వారం ఎసిబి అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జిహె చ్‌ఎం సిలో క్వాలిటీ కంట్రోల్ డి ప్యూటీ ఈఈగా ఎ.దశరథ్ ము దిరాజ్ డిజివిజన్2లో పనిచే స్తు న్నాడు.

బాధితుడి ఫైల్ క్లియర్ చే సేందుకు రూ.20,000 డబ్బులు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.10,000 ఇచ్చిన బాధితుడు మిగతా డబ్బులు పని అయిన తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో డిఈఈ మిగతా డబ్బులు ఇవ్వా లని బాధితుడిపై ఒత్తిడి తేవడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.

వారి సూచనల మేరకు డిప్యూ టీ ఈఈకి రూ. 20,000 కార్యాల యంలో ఇస్తుండగా ఎసిబి అధి కారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు. తర్వాత డిప్యూటీ ఈఈని నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజ రుపర్చాగా రిమాండ్ విధించారు. దీంతో డిఈఈని ఎసిబి అధికారు లు జైలుకు పంపించారు.