Accident ప్రజా దీవెన, ములుగు: ములుగు జిల్లా వేంకటా పూర్ మండలం జవహర్ నగర్ సమీ పంలోని గట్టమ్మ టెంపుల్ సమీ పంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . హరిత కాకతీయ హోటల్ వద్ద మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నందికొండూరు సతీష్ బాబు (33) అక్కడి కక్కడే మృతి చెందాడు.
గోవిందరావుపేట నుంచి ములుగు కు వస్తున్న కారు ములుగు నుంచి పస్రాకు వెళ్తున్న బైక్ ను అతివేగం తో ఢీ కొట్టిందని స్థానికులు చెబు తున్నారు.దీంతో యువకుడు అక్క డి కక్కడే మృతి చెందాడు. కారు డ్రైవరు పరారీలో ఉన్నట్లు తెలిసిం ది, అయితే కారు డ్రైవర్ పిట్టల వెంకటేష్ గా గుర్తించారు. ఈ ప్ర మాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీ సులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.