–నల్లగొండలో విషాద ఛాయలు
–ఓ ఆర్ ఆర్ పై యాక్సిడెంట్
–ఒకరి మృతి ఇద్దరు పరిస్థితి విషమం
Accident on ORR : ప్రజాదీవెన నల్గొండ :రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి ఓఆర్ఆర్ పై చోటుచేసుకుంది. ఈ సంఘటనలో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఒకరి మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇంకొకరు స్వల్ప గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీ ఉడిపి హోటల్ ఎదురుగా ఫిష్ ఎక్వేరియం వ్యాపారస్తుడు ఇంతియాజ్ (వీటి కాలనీ) కు ఇద్దరు పిల్లలు. కూతురు అమతుల్ (22) తన ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం మేడ్చల్ లోని ప్రైవేట్ కళాశాలలో చదువుతూ ఉంది. కొడుకు ఫౌజన్ (24) బీటెక్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్ ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. తమ్ముడి వరుస అయిన శాదాబ్ (28) (రెహమాన్భాగ్ కాలనీ) తన షిఫ్ట్ డిజైర్ కారులో చెల్లెలిని రంజాన్ పండుగ కోసం నల్లగొండ కు తీసుకురావడానికి హైదరాబాద్ కు సౌజన్, షాదాబ్ ఇద్దరు కలిసి వెళ్లారు. హైదరాబాదులో మేడ్చల్ ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబిబిఎస్ చదువుతున్న తన చెల్లెలిని తీసుకొని నల్లగొండకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో వస్తుండగా సుమారు రాత్రి 11 గంటల ప్రాంతం లో ఓఆర్ఆర్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు కీసర ప్రాంతంలో వర్షపు నీటితో తడిసి ఉన్న రోడ్డుపై కారు సడన్ గా అదుపుతప్పి పక్కనగల డివైడర్లను ఒక్కసారిగా ఢీకొట్టడంతో చెల్లెలు అమతుల్(22) అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న కజిన్ బ్రదర్ షాదాబ్ (28) చిన్నచిన్న గాయాలతో సంతోష్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తమ్ముడు ఫౌజన్ (24) చావు బతుకుల మధ్య యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతటి ఘోరాన్ని కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో నల్గొండ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా రంజాన్ పండుగ నిర్వహించుకోవాలన్న కుటుంబా సభ్యుల రోదనలు ప్రజలను కన్నీటి పర్వతాన్ని చేశాయి.