–ధాన్యం సేకరణ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి
–500 రూపాయల బోనస్ ఇస్తున్న విషయాన్ని తెలియజేయాలి
–48 గంటల్లో ధాన్యం అమ్మిన మొత్తం బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే చర్యలు
–అదనపు కలెక్టర్ శ్రీనివాస్
Additional Collector Srinivas : ప్రజాదీవెన నల్గొండ : రబీ ధాన్యం సేకరణ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, చైర్మెన్లకు రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధర పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా రబీ ధాన్యం సేకరణ చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అన్ని కేంద్రాలలో ధాన్యం తూర్పారబట్టే యంత్రాలు, తూకం వేసేయంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తాగునీరు, టెంట్, ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. సన్న ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని, దొడ్డు ధాన్యానికి వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో ధాన్యం అమ్మిన మొత్తం వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకు గాను ఓబిఎమ్ఎస్, ట్రక్ షీట్లను వెంటనే జనరేట్ చేసే విధంగా చూడాలని అన్నారు.
డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.