–ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులే పాత్రికేయులు
–వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Adi Srinivas : ప్రజా దీవెన, వేములవాడ: ప్రజల కు ప్రభుత్వానికి మధ్య వారదులు గా నిలిచే వారే పాత్రికేయలని వే ములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివా రం వేములవాడ పట్టణంలోనీ 2వ బైపాస్ రోడ్డులో గల మహదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలం గాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( టీయూడ బ్ల్యూజే హె143) కరీంనగర్, రాజన్న సిరిసి ల్ల, జగిత్యాల జిల్లాల మహాసభ కు రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయ ణతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో నే ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా రంగం ఉందన్నారు. స్వతంత్ర ఉద్యమం లో, తెలంగాణ ఉద్యమంలో పాత్రి కేయుల పాత్ర మరువ లేనిదన్నా రు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ అణచివేతకు వ్య తిరేకంగా జరుగుతున్న ప్రజా పోరా టాలకు అండగా ఉంటూ, నిజల ను నిర్భయంగా సమాజానికి అంది స్తున్నా రని అన్నారు. పాత్రికేయు లు ఒక్కొక్కరు 100 మందితో సమానమని, వారితో 1987 నుంచి నాకు ప్రత్యేక అను బంధం ఉందన్నారు.
నా రాజకీయ జీవితంలో పాత్రి కేయుల పాత్ర మరువలేనిదని, వేములవాడ ఎమ్మెల్యేగా గెలవడంలో పాత్రి కేయుల పాత్ర ప్రత్యేకమైనదని, ఆ గెలుపులో భాగస్వామ్యమైన పాత్రి కేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవా దాలన్నారు. త్వరలోనే జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు అందజేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీ కలం ద్వారా వాటిని ప్రభుత్వం దృ ష్టికి తీసుకువచ్చేలా చేయాల న్నారు. పౌర సత్వం పై పోరాటం చేస్తున్న ప్పుడు నాకు పార్టీ నాయ కులు, స్నేహితుల శ్రేయోభిలాషు లతో పాటు పాత్రికేయులు మనోధై ర్యాన్ని కల్పించారన్నారు.మీడియా మిత్రుల కష్టసు ఖాల్లో పాలుపంచు కుంటా వారికి అండగా ఉంటామ న్నారు. వేములవాడ రాజన్న ఆల య అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళి కలు, త్వరలోనే నిత్య అన్నదాన సత్రానికి భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. ఇలాం టి కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటా యన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల పాత్రికే యులు పాల్గొన్నారు.