Advocate Narri Swamy : ప్రజా దీవెన, నారాయణపురం : హైదరాబాదులో అత్యున్నత న్యాయస్థానం,సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆల్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్,సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు Y. శ్రీనివాస చారితో కలిసి లాయర్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కురుమ లాయర్స్ ఫోరం సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆల్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సమాచారాన్ని సేకరించి న్యాయవాదులకు సంబంధించిన క్యాలెండర్ ని రూపొందించి ప్రాక్టీస్ చేస్తూనే సామాజిక చైతన్యం కోసం పోరాడుతున్న న్యాయవాది నర్రి స్వామి అభినందనీయులు అన్నారు.లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి మాట్లాడుతూ.
ప్రస్తుత అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ మరణించడం హర్షణీ యం, అదేవిధంగా న్యాయవాద ప్రొటెక్షన్ కూడా ఈ క్యాబినెట్ లోనే ఆమోదం తెలపాలి అని ప్రభుత్వాన్ని కోరుచున్నాము,బీసీ ప్రభుత్వ లేని అడ్వకేట్ గా ఎన్నికై పని చేసిన సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదుల క్యాలండర్ నీ ఆవిష్కరించడం చాలా సంతోషకరం, రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థలో జడ్జిల నియమాకాలో, బార్ కౌన్సిల్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాలని మా లాయర్స్ ఫోరం కోరుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వై శ్రీనివాసులు చారి , ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్,జాయింట్ సెక్రెటరీ రమేష్ కుమార్ కార్యవర్గ సభ్యులు వి మధుసూదన్,సరిత మిశ్రా,అశోక్ సీనియర్ న్యాయవాదులు నాగభూషణం,హనుమంత్ పటేల్,పరశురాం జూనియర్ న్యాయవాదులు సుమన్ బాబు,బాలకృష్ణ పాల్గొన్నారు.