Aga Khan : ప్రజా దీవెన, హైదరాబాద్: మానవతావాది, పద్మవిభూషణ్ గ్రహీత, అగాఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆగా ఖాన్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రక టిం చారు. ఇస్మాయిలీ ముస్లింల వార సుడిగా ఆధ్యాత్మిక గురువుగా నియమితులైన కరీం అల్-హుస్సేనీ ఆగా ఖాన్ IV మరణం మాన వాళికి తీరని లోటు అని ముఖ్య మంత్రి పేర్కొన్నారు. గొప్ప మానవ తావాదిగా ఆయన ప్రపంచవ్యా ప్తంగా ప్రత్యేక గుర్తింపును అందు కున్నారని అన్నారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్ప త్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థ లను నెలకొల్పి మానవాళికి తన సేవలను అందించారని గుర్తు చేశా రు.
పేదరిక నిర్ములన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించి న సేవలు మరిచిపోలేనివని, హైద రాబాద్ కేంద్రంగా ఆగా ఖాన్ సంస్థ లు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.ఆయన జీవి తాంతం మానవ జాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరిం చారని కొనియాడారు. వారి వార సులకు, కుటుంబసభ్యులకు, అను చరులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.