కలికాలం, అఘోరీతో బీటెక్ విద్యార్థి జంప్ జిలానీ
aghoriescape: ప్రజా దీవెన, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ సృష్టిస్తున్న లేడీ అఘోరీ అందరికీ సుపరిచి తమే. అడ పాదడపా ద డప రోడ్లపై ప్రత్యక్షమవుతూ ప్రజలను పోలీస్ యంత్రా లను ముప్పుటతిప్పలు పెడుతోన్న అగోరి మరో సంచలనానికి కేంద్ర బిందువు అయింది. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అ క్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి లో బిటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరీగా మారటానికి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం కల కలం రేపుతోంది.
ప్రియదర్శిని కాలేజ్ లో బిటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రి తం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరీ బస చేసిం ది. ఆ క్రమంలో అఘో రికీ, యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగిం ది.అయితే రెండు రోజుల క్రితం మేజ ర్ అయిన యువతి తాను అఘో రీగా మారటానికి హైదరాబాద్ వెలుతున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్‌ను అని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరీగా మారటం ఇష్టం లేదని దీంతో ఇల్లు విడిచి వెళ్ళి పోతున్నట్లు చెప్పింది.
దీంతో తండ్రి కోటయ్య పోలీసుల ను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అం త కుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్ళిపోతున్నట్లు చెప్ప డంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులుకు చెప్పారు.ఈ క్రమంలో వారు కన్నీరు మున్నీ రుగా విలపిస్తూ తమ కూతురిని ఆ ఘోరి వశపరుచుకుందని ఆరో పించారు. అఘోరి చెర నుంచి త మ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు.
కొంపముంచిన అఘోరికీ ఆశ్రయం… యువతిని లోబరు చుకుని జంప్ అయిన అఘోరీ వ్య వహారంతో యువతి కుటుంబ స భ్యులు లబోదిబోమంటున్నారు. గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలా మణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతు ర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెం దిన తురిమెల్ల కోటయ్య నిన్న మం గళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫి ర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని, నాలుగు నెల ల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బ ట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీస్ వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడి అఘోరికి బట్ట లు కప్పండి అని చెప్పిన తర్వాత తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్ట లు కప్పిందని, అప్పటినుంచి నా కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం జరుగుతుందని తెలిపారు .
కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మా య మాటలతో మోసం చేసి ఆకు పసరుతో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమా నికి యువరాణి ని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపొయ్యాడు.