Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AICCKharge : ఎఐసిసి చీఫ్ ఖర్గే పిలుపు, వచ్చే అ న్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి

AICCKharge : ప్రజా దీవెన, హైదరాబాద్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజా రిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసీసీ ప్రె సిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపుని చ్చారు. గాంధీభవన్ లో తె లంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశా నికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతల మధ్య విభేదాలుంటే పా ర్టీలో ని చర్చించుకోవాలని బయట మాట్లాడవద్దని హెచ్చరిం చారు. ప్ర తిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వవద్దని సమస్యలుంటే ఇన్ చార్జి నేతల తో కో ఆర్డినేట్ చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఇక‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజ ర్వేషన్ అమ లుకు ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలు, పార్టీ సంస్థాగత నిర్మా ణం, జిల్లాల్లో జరుగుతున్న పా ర్టీ కార్యక్రమాలు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు, సంవి ధన్ బచావో కార్యాచరణ ప్రణా ళిక తదితర అంశాలపై చ‌ర్చించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐ సీసీ ప్రధాన కార్యదర్శి వేణుగో పాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మ హేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు స మావేశంలో పాల్గొన్నారు. సమా వే శం ప్రారంభానికి ముందు ఇటీవల సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారి శ్రామికవాడ లోని సిగాచి పరిశ్రమ పే లుడు ఘటనలో మృతులకు సం తాపం తెలుపుతూ మౌనం పాటించారు.

గాంధీ భవన్ కు వచ్చిన మల్లికార్జున ఖర్గేతో బీసీ సంఘాల నేతలు భే టీ అయ్యారు. బీసీనేత జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఖర్గే ను కలిసిన బీసీ నేతలు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, జాతీయస్థాయిలో కులగణన అంశా లు, ఢిల్లీకి అఖిలపక్షం తదితర బీసీ డిమాండ్లను ఖర్గే దృష్టికి తీసు కువెళ్లారు. ఈ మే రకు మల్లికార్జున ఖర్గేకు వినతిపత్రం అందజేశా రు.


కొణిజేటి రోశ‌య్య‌ విగ్రహావి ష్కరణ, ఘ‌ననివాళులు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదహారు సార్లు బ డ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టిం చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, త‌ మిళనాడు మాజీ గ‌వ‌ ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య కాంస్య విగ్ర‌హాన్ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లి కార్జున ఖ‌ర్గే శుక్ర‌వారం ఆవిష్క‌రించారు.

రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మా ర్క‌, మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కు మార్ గౌడ్‌, రోశ‌య్య కుటుంబ స‌ భ్యులు పాల్గొన్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎక్కువ సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా, ము ఖ్య‌ మంత్రిగా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ద‌వుల‌ను అలంక‌రించిన కొణిజే టి రోశ‌య్య కాంస్య విగ్ర‌హాన్ని ల‌క్డీ కాపూల్‌లో ఏర్పాటు చేశా రు. లక్డీకా పూల్ లోని మెట్రో స్టేషన్‌ సమీపం లోని చౌరస్తాలో తొ మ్మిది అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.

శుక్రవారం రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. అరుదైన రికార్డు సాధించిన రోశ‌య్య‌ ఉమ్మడి ఏపీలో కాం గ్రెస్ ప్రభుత్వం లో 16సార్లు ఆర్థికశాఖ మంత్రి హో దాలో రోశయ్య బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయా ల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగా రని సీ ఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప‌ద‌వుల‌కే వ‌న్నే తీసుకువ‌చ్చా ర‌ న్నారు.