Aitaraj Ravi : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ పట్టణ ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్గొండ పట్టణ శాశ్వత ఫోటోగ్రాఫర్
ఐతరాజు రవి (రవి డిజిటల్స్ )కి నల్గొండ పట్టణ ఫోటోగ్రాఫర్స్ సభ్యుల సహకారంతో 23,300/-(ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కంభంపాటి రవి మాట్లాడుతూ మా పట్టణంలోని ప్రతి ఒక్క సభ్యుని, మా కుటుంబ సభ్యులుగా భావించి ఆపదలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ సభ్యులను అసోసియేషన్ సభ్యుల సహకారంతో వారిని ఆదుకోవడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఐతరాజు రవి కి ఆర్థిక సాయం చేసిన పట్టణ ఫోటోగ్రాఫర్స్ సభ్యులకు అసోసియేషన్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంభంపాటి రవి, ప్రధాన కార్యదర్శి దాసపత్రి జనార్ధన్, కోశాధికారి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి ధనంజయ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం రూపేంద్ర కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సామల వెంకటేశ్వర్లు, సలహాదారులు కలగోని సప్తగిరి ఉపాధ్యక్షులు సయ్యద్ కలిముల్లా, బుక్క రాజేష్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు