AITUC : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ ఏఐటియుసి ఆఫీసులో 01.03.2025 న జరిగే నల్లగొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ)7వ మహాసభను జయప్రదం చేయాలని నల్లగొండలో కరపత్రం రిలీజ్ చేశారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి నూనే వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్షులు కేఎస్ రెడ్డి, కార్యదర్శి విశ్వనాధుల లెనిన్, జిల్లా నాయకులు సకినాల అంజయ్య పాల్గొంటున్నారని అన్నారు. పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని అన్నారు .
కావున పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి, కార్యదర్శి రేవల్లి యాదయ్య, కోశాధికారి గోపగోని నరసింహ, కార్యవర్గ సభ్యులు గుల్లి నరేందర్, పిల్లి భాస్కర్, పోతపాక వెంకన్న, కుర్ర స్వామ నాయక్, కత్తుల కొండయ్య, ఖమ్మంపాటి జానయ్య, ముష్టిపల్లి మురళి, చింత బిక్షం తదితరులు పాల్గొన్నారు.