పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటియుసి కార్యదర్శి
AITUC : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సివిల్ సప్లై హమాలి కార్మికుల ఎగుమతి దిగుమతి హమాలి పెంచాలని రేట్లు పెంచాలని జనవరి 1 నుంచి 7 తారీఖు వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం హమాలి రేట్లు పెంచుతూ జీవో విడుదల చేసిందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు .నల్గొండ లో సివిల్ సప్లై హమాలి కార్మికులు పెరిగిన రేట్ల జీవో విడుదలైన సందర్భంగా స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేసుకోవడం. జరిగింది సమస్యల పరిష్కారం కోసం పోరాటలే ఏకైకమార్గమని ఆయన పేర్కొన్నారు.
కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. ప్రభుత్వం గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న హమాలి ఏరియర్స్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం సివిల్ సప్లై డిఎం కార్యాలయంలో డిఎంకి ఆఫీస్ సిబ్బందికి స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి సివిల్ సప్లై హామాలిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ వెంకన్న డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల లేనిన్ బుచ్చయ్య గిరి జానీ రాంబాబు శివ,రామస్వామి సైదులు తదితరులు పాల్గొన్నారు.