జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
**పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం..
District Collector Tripathi : ప్రజా దీవెన/ కనగల్: కనగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.మార్చి నెలలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఇప్పటివరకు కొన్ని గ్రౌండ్ కాకపోవడంపై ఆమె పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఎవరైనా ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపకపోతే వారి నుండి ఇష్టం లేనట్టుగా రాతపూర్వకంగా తీసుకోవాలని, అలాంటి వారి జాబితాను రూపొందించి పంపించాలని చెప్పారు.
రెండు ,మూడు రోజుల్లో మంజూరైన అన్ని ఇండ్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా గ్రామ పంచాయతీల వారీగా పంచాయతీ కార్యదర్శులతో వివిధ స్థాయిలలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు.గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ,ఇన్చార్జి ఎంపిడిఓ సుమలత, కనగల్ తహసిల్దార్ పద్మ, తదితరులు ఉన్నారు.