Alumni : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం జడ్పి స్కూల్లో చదువుకున్న 2003- 2004 ఎస్ ఎస్ సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం శాలిగౌరారం లోని జిబిఎం ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 160 మంది విద్యార్థిని విద్యార్థులు 21 సంవత్సరాల తర్వాత అందరు కలుసుకోవడం వారి మధుర జ్ఞాపకాలు స్మరించుకొని ఒకరినొకరు ఆప్యాతగా పలకరించుకున్నారు.
ఆనాడు పాఠశాల లో భోదించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు మెమోటోస్ అందజేశారు.. వారి గత అనుభవాలు ఇప్పుడు ఉన్న స్టేటస్ ను తెలుపుకుంటూ సంతోష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురువారావు, కృష్ణారెడ్డి, కుశలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,యాదమ్మ, వార్డెన్ గంటెల నాగభూషణం,తదితరులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.