–ఎంజియి రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి
Aluvala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ , ఎడ్యునట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ (Telangana academy for skill development) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అధ్యాపకుల ఐదు రోజుల శిక్షణ తరగతులను రిజిస్టర్ ఆచార్య అలువాల రవి ఓఎస్డి టు విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మరియు టాస్క్ అధికారులతో ప్రారంభించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రార్ (register) మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నైపుణ్యాల పెంపు పై దృష్టి సారించాలి అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నేడు నిర్ణయాలు అన్ని డేటా , మెషిన్ లెర్నింగ్ (data and mission learning) మరియు కృత్రిమ మేధా ఆధారంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకులు సైతం వీటి పై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అధ్యాపకులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీనీకరించు కుంటూ విద్యార్థులను జాగ్రత్త పరుస్తూ సమాజానికి పరిశ్రమకు అనుసంధానకర్తలుగా నిలవాలని సూచించారు. త్వరితగతిన మారుతున్న సాంకేతికతను ఆకలింపు చేసుకొని విద్యార్థులకు అందించడంలో ముందుండాలని సూచించారు. ఎడ్యునెట్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా మొట్టమొదట కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ సూచక మన్నారు. ఈ సెంటర్ ద్వారా అధ్యాపకులకు విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఓఎస్డి టు విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డీన్ ఆచార్య రేఖ, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా వై ప్రశాంతి, శ్రీమతి జయంతి, శ్రీ దుర్గాప్రసాద్, టాస్క్ అధికారులు
జి సుధీర్ ,సుమిత్ సునీల్, పవన్ తదితర అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.