Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amazon Bumber Offer: తెలుగు విద్యార్థికి బంపర్ ఆఫర్, కొడంగల్ వాసికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం

ప్రజా దీవెన, వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గం బొంరస్ పేట్ మండలం,తుంకిమెట్ల గ్రామాని కి చెందిన సయ్యద్ యాసిన్ ఖు రేషి కుమారుడు సయ్యద్ అర్బాజ్ ఖురేషి (26) కి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్ లో రూ. 2 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో అమెరికాలో బంపర్ ఆఫర్ దక్కిం చుకున్నాడు. అమెరికా కాలమా నం ప్రకారం సోమవారం అతను ఈ ఉద్యోగంలో చేరాడు.

2019 లో ఐఐటి పాట్నా నుండి కంప్యూటర్ సైన్సులో తన బీటెక్ పూర్తి చేసిన ఈ యువకుడు 1980-90 ల్లో నియోజకవర్గంలో ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించిన గాంధేయవాది, మానవతావాది,అప్పటి కాంగ్రెస్ నాయకులు దివంగత డాక్టర్ జలాలుద్దీన్ ఖురేషి మనవడు బీటెక్ మూడవ సంవత్సరంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మెషీన్ లెర్నింగ్ కోవిదుడు గెయిల్ వద్ద మూడు నెలల ఇంటర్న్షిప్ చేశాడు.

తరువాత బెంగళూర్ లోని “మైక్రోసాఫ్ట్ రీసర్చ్” లో రెండు సంవత్సరాలు పనిచేసి, యు ఎస్ ఏ లోని యూనివర్సిటీ ఆఫ్ మసా చుసెట్స్ నుండి 2023 లో ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్ లో ఎంఎస్ పట్టా పొందాడు. ఎంఎస్ లో చూపిన ప్రతిభ ఆధా రంగా ప్రముఖ ఐటీ సంస్థ అయిన గూగుల్ లో ఇంటర్న్షిప్ చేసే అవ కాశం దక్కింది. స్థానిక మూలాలు కలిగిన ఈ యువకుడి విజయం వెనకబడ్డ కొడంగల్ ప్రాంత యు వతకు స్ఫూర్తి నివ్వాలని ఆకాం క్షిస్తున్నామన్నారు పలువురు సామాజికవేత్తలు.