*యూనివర్సిటీలో నూతన కోర్సులు అందుబాటులోకి
*కోదాడకు రీజినల్ సెంటర్ ఏర్పాటుకు కృషి ధర్మానాయక్ .
Ambedkar Open University: ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) స్టడీ సెంటర్లలో అడ్మిషన్లు పెంచేందుకు కోఆర్డినేటర్లు, కౌన్సిలర్లు కృషి చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ బానోతు ధర్మానాయక్ (Dharmanayake) అన్నారు. శుక్రవారం కోదాడ krr ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ను పరిశీలించి ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ NAAC’ A ‘ గ్రేడ్ సాధించింది అని తెలిపారు. అతి తక్కువ ఫీజుతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం యూనివర్సిటీ కల్పిస్తుంది అన్నారు. చదువు మధ్యలో మానేసిన వారికి రెగ్యులర్ గా కళాశాలకు వెళ్లి చదువుకోలేని వారికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ Ambedkar Open University) మంచి విద్యా అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు.
యూనివర్సిటీలో ఇటీవల కొత్త ఉపాధి అవకాశాలు (Employment opportunities)కల్పించే కొత్త కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. దూరవిద్య ద్వారా చదివిన ఎంతోమంది మంచి గొప్ప ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలిపారు, దూరవిద్య ద్వారా పీజీ చేసి సెట్ నెట్ పీహెచ్డీలు సాధించిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారన్నారు. కోదాడకు త్వరలో రీజినల్ స్టడీ సెంటర్ ను (Regional Study Center) మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో అందరూ కృషి చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోఆర్డినేటర్, కౌన్సిలర్లను కోరారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చందా అప్పారావు, డాక్టర్ ఈ సునీత,కో-ఆర్డినేటర్ జి సైదులు, జాక్తో సురేష్, అధ్యాపకులు నిర్మల కుమారి, ఎస్.ఎం రఫీ, టీ రాజు, k.సైదులు, వెంకటేశ్వర్ రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు