అంబులెన్స్ చూసి అవాక్కయిన పోలీసులు, చివరకు ఏమైందంటే
Ambulencecrime: ప్రజా దీవెన, హైదారాబాద్: హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ హోల్చల్ చేసింది. సదర్ అంబులెన్స్ అదే పనిగా సైరన్ మోగించుకుంటూ రోడ్డుపై పరుగులు పెడుతుంటే పాపం ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ట్టుంది అన్న మానవత్వంతో ప్రతి ఒక్కరూ అంబులెన్స్ కు దారి ఇ చ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది.
అంబులెన్స్ ల సైరన్ మోగే విషయంలో వస్తున్న అనేక ఆరోపణల నేపథ్యంలో పో లీసులు తాజాగా నిషిత పరిశీలనకు ఉపక్రమిం చా రు. ఈ క్రమంలో మంగళవారం ఓ అంబులెన్స్ అందరిని సంబ్ర మా శ్చర్యాలకు గురిచేసింది. సదరు అంబులెన్స్ కు సంబంధించిన కథా కమిషు ఇలా ఉంది. కుక్కని అంబులెన్సులో తీసుకెళ్తున్న డ్రైవర్ సైరన్ మోగించుకుం టూ వెళ్తుండగా ఆపిన పోలీసులు కుక్క కు కుటుంబనియంత్రణ ఆప రేషన్ కోసం తీసుకెళ్తున్నానన్న డ్రై వర్ సమాధానంతో కంగుతిన్నా రు.
అంబులెన్సుల సైరన్ దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులతో పోలీ సులు తనిఖీలు చేపట్టగా పం జాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తని ఖీల్లో కుక్క వ్య వహారం వెలు గు చూసింది.పోలీసులు తనిఖీ చే స్తుండగా అతి వేగంగా సైరన్ తో అక్కడకు వచ్చిన అంబులెన్స్ లో పల రోగి ఉన్నాడా లేడా అని చూ సేందుకు ట్రాఫిక్ పోలీసులు డోర్ తీయగా కనబడిన కుక్కని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
కు క్కను అంబులెన్సులో ఇలా పేషంట్ మాదిరిగా సైరన్ మోగించు కుంటూ ఎందుకు తీసుకెళ్తున్నావం టూ ప్రశ్నిస్తే మియాపూర్ లో కుక్క కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తు న్నానని డ్రైవర్ సమాధానం చెప్పడంతో పోలీసులకు ఆ క్షణంలో ఏం చేయా లో తోచని పరిస్థితి తలెత్తింది. అం బులెన్సులో పేషంట్ లేక పోయిన ప్పటికీ సైరన్ ని దుర్వినియోగం చేసినందుకు గాను అం బులెన్స్ డ్రై వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసు లు.