*బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు**
గంధమల్ల ఆనంద్ గౌడ్ హెచ్చరిక *
Anand Goud : ప్రజా దీవెన, హైద్రాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని జిహెచ్ఎంసి ప్రాంతాలలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీధి లైట్లును E E S L అనే ఏజెన్సీ మెయింటినెన్స్ చేస్తున్నది కానీ గత మూడు నెలల నుండి ఈ ఏజెన్సీ ఎక్కడ కూడా వీధిలైట్లు కాలిపోయిన వెలగకపోయినా కనీసం అక్కడ ఏదైనా మెయింటెనెన్స్ ఉన్న ఆ ఏజెన్సీ సిబ్బంది పనిచేయడం ఆపివేసింది వెంటనే జిహెచ్ఎంసి స్పందించకపోతే జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధ మల్ల ఆనంద్ గౌడ్ హెచ్చరించారు..
ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ..ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ అక్కడి సిబ్బందిని అడిగినప్పుడు మాకు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు కాబట్టి మేము పనిచేయడం ఆపివేశామని చెప్పడం జరుగుతున్నది దాదాపు హైదరాబాద్ పట్టణంలో అనేక కాలనీలలో బస్తీలలో లైట్లు వెలగక చీకటమయమైపోయాయి కానీ మూడు నెలల నుండి జిహెచ్ఎంసి కమిషనర్ గాని సంబంధిత మంత్రి గానీ ఈ హైదరాబాదు పట్టణంలో వీధిలైట్లు గాని వాటి మెయింటెనెన్స్ గానీ మాకు సంబంధం లేనట్లుగా పట్టించుకోవడం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రపంచంలోనే హైదరాబాదును ఉన్నత స్థానంలో నిలబెడుతానాని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఉన్న హైదరాబాదులో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు అయిన వీధిలైట్లను కూడా మెయింటెనెన్స్ చేయలేని స్థితిలో ప్రభుత్వం పడిపోవడం సిగ్గుచేటు వెంటనే దీనిపై హైదరాబాదు పట్టణ ప్రజలకు జిహెచ్ఎంసి కమిషనర్, మంత్రి గారు ఎందుకు వీధిలైట్ల పనులు కాంట్రాక్ట్ ఏజెన్సీ చేయడం లేదు ఎందుకు ఆగిపోయాయో తెలుపవలసిన అవసరం ఉన్నది.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ పట్టణంలో అనేక కాలనీలలో వీధిలైట్లు వెలగక అనేక చోట్ల మరమ్మత్తులు చేయక చీకటి మయమైపోయాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిన ఏజెన్సీ ద్వారా పనులు ప్రారంభించేందుకు పూనుకోకపోతే బిజెపి పార్టీ హైదరాబాద్ పట్టణ ప్రజల తో కలిసి జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని గంధమల్ల ఆనంద్ గౌడ్ తెలిపారు..