Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anand Kumar : డిజిటల్ పేపర్ ముసుగులో అక్రమ వసూళ్ళు, ప్రధాన నిందితుడు ఆ నంద్ కుమార్ అరెస్టు

Anand Kumar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ అ ధికారుల అసత్య, అబద్ధపు వార్త లు ప్రచురిస్తున్న క్రమంలో వారిని బెదిరింపులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతోన్న “క్రైమ్ మిర్రర్ ఈ-న్యూస్ పేపర్” స్టేట్ ఇ న్వెస్టిగేషన్ బ్యూరో అయిన నా గుల ఆనంద్ కుమార్ ఉరఫ్ ఆనం ద్ ను అరెస్టు చేసినట్లు మిర్యా లగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు వెల్లడించారు. మిగతా ఇద్దరు సహ-నేరస్తులయిన, తుప్పరి రఘు, పెరబోయిన ఆం జనేయులు ఉరఫ్ అంజిలను ఇప్ప టికే మిర్యాలగూడ పోలీసులు అరె స్టు చేసిన విషయం విదితమే అం టూ కేసు పూర్వపరాలు మీ డి యాకు తెలిపారు.

అక్రమ వసూళ్ళకు ప్రత్యేక ముఠా… “క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్” కు స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూ రో అయిన నాగుల ఆనంద్ కు మా ర్ ఉరఫ్ ఆనంద్, తనకు పరి చయ స్తులైన తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు, అంజిల సహ కా రంతో ఒక ముఠాగా ఏర్పడి నల్ల గొండ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోనూ, కొంతమంది ప్రభుత్వ ఉ ద్యోగుల ను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని, అక్రమ మార్గంలో డ బ్బులు సంపాదించాలనే ఉద్దే శ్యంతో అనేక ప్రయత్నాలతో ముం దుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తప్పుడు, కల్పిత సమా చారంతో క్రైమ్ మిర్రర్ డిజిటల్ ప త్రికలో ప్రచురణలు చేయడం ద్వారా వారిని బెదిరించి డబ్బులు ఆర్జిం చడం ప్రారంభించారు. ఈ నేప ద్యంలో గతంలో నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో గల డిస్ట్రిక్ట్ మెడి కల్ అండ్ హెల్త్ ఆఫీసు లో అసి స్టెంట్ స్టాటిస్తికల్ ఆఫీసర్ గా విధు లు నిర్వహించిన ఎస్.సి. (మాదిగ) కులానికి చెందిన కొంపల్లి మత్స్య గిరి, పారా మెడికల్ యూనియన్ లో వారి డిపార్ట్మెంట్ సమస్యల పరిష్కారాలకు చురుకుగా పని చే స్తున్నాడని, అతనిని తమ లక్ష్యం గా ఎంచుకొని, ఇంకా తేడాది జులై 27 వ తేదీన డి ఎం అండ్ హెచ్ ఓ ఆఫీసు సిబ్బంది తో పాటు పరో క్షం గా మత్స్యగిరి పైనా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అర్ధం వచ్చే వి ధంగా “ప్రభుత్వ ఉద్యోగాల పేరి ట నిరుద్యోగులకు కుచ్చు టోపీ” అ నే శీర్షికతో తమ క్రైమ్ మిర్రర్ పేప ర్ లో ప్రచురించి, సోషల్ మీడియా లో కూడా వైరల్ చేసినారు. అనం తరం సదరు మత్స్యగిరి ని వాట్సా ప్ కాల్స్ ద్వారా అతనిని సంప్రదిం చి, నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే అతని పేరు బహిర్గతం చేస్తూ ఇదే విధంగా క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ లో అబద్ధపు స్టోరీలు రాస్తామని, లే దంటే నీ అంతు చూస్తామని బెది రించారు. బాధితుడు భయపడి, నేను ఎలాంటి తప్పుడు పని చే యలేదు, నన్ను వదిలిపెట్టండని వేడుకొన్నప్పటికి, వినకుండా పదే పదే ఫోన్లు చేస్తూ డబ్బులు ఇవ్వా లని వేధించగా వారి వేధింపుల నుండి తప్పించుకోవడానికి బాధి తుడు మత్స్యగిరి నెల రోజుల తర్వాత యాభై వేల రూపాయలు గూగుల్ పే ద్వారా పంపించడం జరిగింది.

 

అయినప్పటికీ, ఆ డబ్బు లు సరిపోవనీ, మళ్ళీ ఫోన్లు చేసి బెదిరించగా, మరొక నలభై వేలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవలే సదరు నేరస్తులపైన వారి ఆగడాల గురించి వచ్చిన సమా చారం సోషల్ మీడియాలో చూసి, ఈ నెల 2వ తేదీన నల్లగొండ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో తనకు జరి గిన అన్యాయం గురించి సదరు నేరస్తులపైనా ఫిర్యాదు చేయగా క్రైమ్ నంబర్: 27/2025 U/s. 308(2), 308(5), 351(2) R/w 3(5) of BNS, Sec 3(2)(v)(va) of SCs/STs (POA) Amendment Act-2015 ప్రకారం కేసు నమోదు కాగా నల్లగొండ డి.ఎస్.పి. కె శివరాం రెడ్డి విచారణ చేసి సాక్ష్యాధారాలు సేకరించడం ద్వారా మంగళవారం ప్రధాన నింది తుడు అయిన నాగుల ఆనంద్ కుమార్ ను అరెస్టు చేసి అతని వద్ద నుండి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండు కు పంపారు
సదరు నేరస్థుడి విచారణలో, మరి కొన్ని దురాగతలు వెలుగులోకి వ చ్చినాయని, మిగతా ఇద్దరు నేర స్తులను, వీరబాబు, సి.ఐ. మిర్యా లగూడ రూరల్ ను కూడా ఇదే విధంగా వేధించి, భయపెట్టి రెండు లక్షలు డిమాండ్ చేసిన, కేసుకు సంబంధించి, మిర్యాలగూడ టూ టౌన్ లో నమోదు అయిన కేసులో ఇటీవలే అరెస్టు చేసి రిమాండుకు పంపడం జరిగింది. ఈ ముఠా నల్ల గొండ జిల్లాలో ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను వేధించి, భ యపెట్టి అక్రమంగా డబ్బులు వ సూలు చేసినట్లు సమాచారం వున్నది. కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు అయి విచారణలో వు న్నాయి. నిందితుడు ఆనంద్ కుమార్ ఇదే విధంగా వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఇంకా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్ప డ్డాడని తెలుస్తుంది. మొదటి ఇద్ద రు నిందితుల అరెస్టు తర్వాత, మి గతా బాధితులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీసు వారిని సం ప్రదించి ఫిర్యాదులు చేస్తున్నారు. తదుపరి విచారణలో ఇంకొన్ని విష యాలు వెలుగులోకి వచ్చే అవకా శం ఉంది.