ప్రజా దీవెన, కోదాడ: :ప్రేమకు, శాంతికి ప్రతిరూపం క్రిస్మస్ అని కోదాడ ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ ఆనందరావు అన్నారు డిసెంబర్ 25.క్రిస్మస్ పండుగ సందర్బంగా వారు కట్ చేసి కోదాడ ప్రాంత క్రైస్తవులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
బుధవారం మాజీ సైనికుడు చెడపంగు జయరాజు నివాస గృహాలలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాస్టర్ ఆనందరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు నిర్వహించు కుంటున్న క్రిస్మస్ కు ఎంతో ప్రత్యే కత ఉందని,క్షమించే గుణం ఉన్న వారు క్రైస్తవులని, వారందరూ పేదలకు ఉచిత సహాయం చేస్తా రని, ప్రేమకు, శాంతికి ప్రతిరూపం క్రిస్టమస్ అని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే హింసకుతావులేదని, శాంతి, ప్రేమ మాత్రమే ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాతంగి గాంధీ,చెడపంగు జయరాజు మాతంగి రమేష్ , మాతంగి సురేష్ బంకా వీరేంద్రనాథ్, వెంకటరత్నం బంకా,కరుణ, చెడపంగు బుజ్జీమ్మ, శిరిమళ్ళ వెంకటరమణ, స్నేహలత మాతంగి విజయరాణి,మాతంగి స్రవంతి , పండు,సుందరమ్మ అఖిల్, భాను ప్రసాద్ ,గగన్ తేజ్, కుషాల్ చరిత్, చిన్ను బాబు అద్వైత్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
