Anganwadi : ప్రజా దీవెన, నారాయణపూర్ : చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలోని 4వ అంగన్వాడీ సెంటర్ లో వసంత పంచమి సందర్బంగా 3 సంవత్సరాలు పూర్తి అయినా పిల్లలకీ అంగన్వాడీ టీచర్ సోనీ అధ్వర్యంలో సామూహిక అక్షరభ్యసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిల్లల తల్లులకు జాతీయ విద్య విధానం గురించి వివరించడం మరియు ప్రతి రోజు పిల్లలు చేసే కార్యక్రమాల గురించి చెప్పడం, ప్ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా అంగన్వాడీ సెంటర్ లు ఉన్నాయి అని తల్లులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సోనీ, స్వప్న,విజయలక్ష్మి, శైలజ ,ఆయా,పిల్లల తల్లిదండ్రులు,గర్భిణీ, బాలింతలు హాజరైనారు.