–రాష్ట్ర మహిళ ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ,నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్
Anita Ramachandran :
ప్రజా దీవెన, చిట్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిర మ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని రాష్ట్ర మహిళ ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ,నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ అన్నారు. ప్రజా పాలన గ్రామస భలలో భాగంగా గురువారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండలం, పెద్దకాపర్తి లో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇందిర మ్మ ఇండ్లు ,రైతు భరోసా, ఇందిర మ్మ ఆత్మీయ భరో సా అందించేం దుకు ప్రజా పాలన గ్రామసభలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇంది రమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని నిరుపేద కూలీలు 2023- 24 లో ప్రతినెల 20 రోజులు పని చేసిన ఉంటే రెండు విడుతలుగా 6000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటివరకు రేషన్ కార్డులు లేని వారికి ,అలాగే కార్డులలో ఎవరి పేరైనా చేర్చాల్సి వస్తే దరఖాస్తు చేసుకున్న, అర్హతను ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోనట్లయితే గ్రామ సభలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు .ప్రజా పాలన ,మీసేవ, గ్రామసభల్లో ధరకాస్తూ చేసుకున్న వారందరికీ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల లోభాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వస్తాయని, ఎవరైనా దరఖాస్తు చేసుకోనట్లయితే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం గుర్తించిన అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
రైతు భరోసా కింద ఇండ్లు, ప్లాట్లు, రాళ్లు, రప్పలు, కొండలు ఉన్న భూములకి రాదని, సేద్యం చేసే వ్యవసాయ యోగ్యమైన భూమికి వస్తుందని ఇవన్నీ నిరంతర ప్రక్రియ అని, ఈ నెల 26 నుండి ఈ నాలుగు పథకాలను అందించడం జరుగుతుందని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, తదితర పథకాల కింద గ్రామ సభలలో చదువుతున్న జాబితా ఖరారు అయినది కాదని స్పష్టం చేశారు. ప్రజా పాలన, ప్రజావాణి, కులగనన ,గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదవడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్కరికి రేషన్ కార్డు కానీ ,ఇందిరమ్మ ఇండ్లు గాని మంజూరు చేయలేదు అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు అపోహలకు గురికా వద్దన్నారు .
రేషన్ కార్డులకు కూడా ఇది వరకే ఈ సేవ ,ప్రజా పాలన, మండలాల లో సమర్పించిన దరఖాస్తులు, ప్రస్తుతం కొంతమంది గ్రామస భల్లో కూడా ఇస్తున్నారని వాటిని స్వీకరిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
గ్రామసభలు అయిపోయిన తర్వాత కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపిడిఓ కార్యా లయం లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పిం చవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా స్థలం వేరే చోట ఉండి దరఖాస్తు దారువేరే చోట ఉన్నట్లయితే స్థలమున్నచోటికి దరఖాస్తు బద లాయింపు చేయడం జరుగుతుం దని, ఈ పథకాలను నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈనెల 21 నుండి 24 వరకు మాత్రమే గ్రామసభలు నిర్వహి స్తామని, ఇది చివరి అవకాశం కాదని వెల్లడించారు.
అనంతరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, జిల్లా కలెక్టర్లు చిట్యాల లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ , గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్ల లకు అందిస్తున్న పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలు, తదితర వివరాలను అడిగి తెలుసుకు న్నారు.