Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anita Ramachandran : నిరంతరాయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు

–రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, జిల్లా నోడల్ అధికారి అనితా రామచంద్రన్

Anita Ramachandran :ప్రజా దీవెన, నల్లగొండ: రైతు భరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలు నిరంతరం కొ నసాగుతాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, న ల్గొండ జిల్లా నోడల్ అధికారి అని తా రామచంద్రన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ 4 పథకాల అమలులో భాగంగా ఆమె నల్గొండ జిల్లా ,నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో ఈ 4 పథ కాల కింద లబ్ధిదారులకు మంజూ రు ఉత్తర్వులను అందజేశారు. ( 115) మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, మంజూరు ఉత్తర్వులను అందజేయగా, (90) మందికి రేషన్ కార్డులు ,ఆత్మీయ భరోసా కింద( 12) మందికి, అలాగే రైతు భరోసా కింద (652 )మంది రైతులకు లబ్దిని చేకూర్చే పత్రాల ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఆమె అందజేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో నోడల్ అధికారి అనితా రామ చంద్రన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం రోజున ఆదివారం అత్యంత అట్టహాసంగా పై నాలుగు పథకాలను అన్ని జిల్లాలలో ప్రారం భించడం జరిగిందని అన్నారు.

 

 

ఈ పథకాల కింద లబ్ధి రానివారు బాధపడాల్సిన అవసరం లేదని, ఈ అన్ని పథకాలు నిరంతరం కొనసాగుతాయని, వీటికి ఎలాంటి ఆఖరి తేదీ అన్నది లేదని తెలిపా రు. గుండ్లపల్లి గ్రామంలో ఇండ్లు మంజూరు చేసిన 115 మంది లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మిం చుకోవాలని, 6 నెలల్లో రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తో కలిసి గృహప్రవేశాలకు వస్తామని అన్నారు .అలాగే నిరుపేదలు, కార్డు లేనివారికి 90 మందికి గుండ్లపల్లిలో రేషన్ కార్డు లు మంజూరు చేయడం జరిగిం దని, వారందరికీ ప్రతినెల ప్రభు త్వం రేషన్ అందిస్తుందని తెలి పారు.

 

 

2023- 24 సంవ త్సరంలో ఉపాధి హామీ జాబు కార్డు కలిగి ఉండి నెలకు కనీసం 20 రోజులు పని చేసిన 12 మందికి గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్కో విడత 6000 చొప్పున 12 వేల రూపాయలను వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నదని ఆమె వెల్లడించారు. రైతు భరోసా లో భాగంగా 652 మంది రైతులకు సంవత్సరానికి 12000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ,రేపటి నుండే వారి వారి అకౌంట్లో డబ్బులు జమవుతా యని , ఈ మొత్తం తో రైతులు వారి వ్యవసాయ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథ కాలను గుండ్లపల్లి లో పండగ వా తావరణం లో నిర్వహించిన ఈ కార్యక్రమాలను ప్రారంభానికి రావ డం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

 

 

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ పేదల కళ్ళల్లో ఆనందం కలిగినప్పుడే పండగని అన్నారు. ఇలాంటి పండుగ వాతావరణం గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలిగిందని, రాష్ట్ర ప్రభు త్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కింద నిరుపేదల కు లబ్ధి కలిగించడం సంతోషమని తెలిపారు .గుండ్లపల్లి గ్రామంలో అత్యంత నిరుపేదలు, వెనుకబడిన వారు ఉన్నందున ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో భాగంగా 115 మందికి ఇండ్లు, 90 మందికి రేషన్ కార్డులు ,652 మందికి రైతు భరోసా, 12 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరో సా కింద మంజూరి పత్రాలు ఇవ్వ డం జరిగిందని ఆమె వెల్లడిం చారు .ఇవి నిరంతర ప్రక్రియని కొనసాగుతాయని, రానివారు ఎవరు కంగారు పడాల్సిన అవ సరం లేదని తెలిపారు .

 

అన్ని పథకాలు ఎలాంటి వ్యత్యాసం లేకుండా, పక్షపాతం లేకుండా స్యాచురేషన్ పద్ధతిలో అంది స్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి మొద టి విడుతన ఇండ్లు మంజూరు చేయడం జరిగిం దని, అనంతరం తక్కిన వారికి కూడా మంజూరు చేస్తామని ఆమె వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమం త్రి ఏ. రేవంత్ రెడ్డి కోసిగి మండలం చంద్రవంచ లో ప్రారంభించిన నాలుగు పథకాల ప్రారంభ కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా ప్రజలు తిలకించారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రత్యేక అధి కారి డిఆర్డిఏ శేఖర్ రెడ్డి, మున్సిప ల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, జిల్లా అధికారులు ఈ కార్య క్రమానికి హాజరయ్యారు.