ప్రజా దీవెన, కోదాడ: ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో పుల్లయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీ కుటుంబాన్ని పరామర్శించి అధైర్యపరవద్దని అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయన వెంట కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు,గౌరవ అధ్యక్షులు పూర్ణ చందర్రావు, గంధం రాము, వాసు,పడిశాల నాగరాజు, తోళ్ల గురునాథం, ఎస్ కే సుభాని. పాల్గొన్నారు