Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anjan Goud: జర్నలిస్టుల సమక్షమమే హౌసింగ్ సొసైటీ లక్ష్యం ‌. అంజన్ గౌడ్

Anjan Goud:ప్రజా దీవెన, కోదాడ: జర్నలిస్టుల సమక్షమమే లక్ష్యంగా హౌసింగ్ సొసైటీ పనిచేస్తుందని టి యు డబ్ల్యూ జే హెచ్143 సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ (Suryapet District Press Club)అధ్యక్షులు ,జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు అంజన్ గౌడ్ అన్నారు శనివారం పట్టణంలోని స్థానిక త్రివేణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు .జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీలలో యూనియన్లకు, రాజాకీయాలకు సంబంధం లేకుండా అక్రిడేషన్ (Accreditation)కలిగి ఉన్న ప్రతి విలేకరి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా చేరవచ్చు అని తెలిపారు జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం శ్రేయస్సు కోసం సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత మొట్ట మొదటిగా రాష్ట్రంలో ఏర్పాడిన నూతన హౌసింగ్ సోసైటీ కోదాడ (New Housing Society Kodada) జర్నలిస్టులదే అని చెప్పారు.సొసైటీ పార్టీలకు, యూనియన్లకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు. జర్నలిజం వృత్తిని నమ్ముకొని అనేక పేద జర్నలిస్టులు ఇళ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని,తప్పనిసరిగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జర్నలిస్టుల (Government journalists) చిరకాల కల అయినా ఇండ్ల స్థలాల మంజూరుకై ముందడుగు వేస్తుందని, ఆ దిశగా సొసైటీ పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు పడిశాల రఘు ,కార్యదర్శి శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు హరికిషన్ రావు, డైరెక్టర్లు కోట రాంబాబు, మల్లికార్జున రావు, కుడుముల సైదులు, మరికంటి లక్ష్మణ్, షేక్ నజీర్, తంగళ్ళపల్లి లక్ష్మణ్, శ్రీకాంత్, గోపాల్, సైదులు, శీను, గోపి, నరేష్, సురేష్, లింగయ్య, మల్లయ్య వెంకటనారాయణ, శేఖర్, శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.