Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anjana Goud : ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

Anjana Goud : ప్రజా దీవెన, కోదాడ : కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈనెల 30 తారీఖున పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన గౌడ్ పేర్కొన్నారు. గ్రాండ్ టెస్ట్ కు సంబంధించి టిస్ట్ బ్రోచర్ను సోమవారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మీడియా సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అభినందించారు.

 

విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ద్రోహదపడుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోదాడ ,అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతే, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయం తెలియజేసి విద్యార్థులను గ్రాండ్ టెస్ట్ కు హాజరయ్యేలా చూడాలని కోరారు.ఈ గ్రాండ్ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి బహుమతి 5016, రెండవ బహుమతి 3,016,మూడవ బహుమతి 2016 అందజేయనున్నట్లుగా తెలిపారు. సంప్రదించిన నెంబర్ల,9701415412 ఈ కార్యక్రమంలో.. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, హరికిషన్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు, పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, వెంకటనారాయణ, గోపాలకృష్ణ, నరేష్, సత్య రాజు, పవన్, నజీర్, రహీం, వీరబాబు, సైదులు రమేష్, మనీ తదితరులు పాల్గొన్నారు